పాత తెలుగుసినిమాల వివరాలు, విశేషాలు 1981 ( చివరి భాగం)

maria-o-my-darling-81100202.10.1981 శుక్రవారం మరియా! ఓ మై డార్లింగ్! (కన్నడ డబ్బింగ్) నిర్మాత, దర్శకులు: దొరైభగవాన్; సంగీతం:శంకర్గణేష్; కథ, చితానువాదం: ఎస్.మధు; ఛాయాగ్రహణం: వీ. రంగా ; కూర్పు: వీ. వెల్లెస్వామి తారాగణం : కమల్ హాసన్, శ్రీప్రియ ఎంపీ. శంకర్, వజాముని, (కన్నడ మాతృక ఇదేపేరుతో 1980 జూన్ 6న విడుదలైంది)

03.10.1981 శనివారం సంఘం మారాలి (శ్రీ సాయిరాం పిక్చర్స్); సమర్పణ: జ్యోతిచిత్ర; నిర్మాత: పొలమరశెట్టి అప్పారావు; నిర్మాణనిర్వహణపాబోలురామారావు; స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఎస్ఎం.సంతానం; సంగీతం: మాధవచౌదరి; సంగీతపర్యవేక్షణ:ఎస్.రాజేశ్వరరావు; కథ,మాటలు: భరత్; పాటలు:దేవులపల్లి కృష్ణశాస్త్రి,కొసరాజు, భరత్; నేపథ్యగానం:సుశీల,జానకి,వాణీజయరామ్; ఎల్ఆర్.ఈశ్వరి, రామకృష్ణ,ఎంఆర్.ప్రసాద్; నృత్యాలు:చిన్న; పోరాటాలు:టీసీ.నాగమూర్తి; కళ: .శ్రీనివాసరావు; ఛాయాగ్రహణం:డీ.సుబ్రహ్మణ్యం; కూర్పు: కే.దాశరథి; తారాగణం: నూతననటి జ్యోతిచిత్ర. హరిప్రసాద్, ఝాన్సీ, జయవాణి, శ్రీరేఖ, కేవీ.లక్ష్మి, రాజ్ కమల్, వనజ, జ్యోతిలక్ష్మి, మిక్కిలినే ని, కాకరాల, చంద్రరాజు, సత్తిబాబు, చలపతిరావు; అతిథినటి: శాంతకుమారి:మాస్టర్ చందు మాస్టర్ చంటి, (ఈ చిత్రం 1980 మే 20 న సెన్సార్ అయింది)

o-amma-katha-81101303.10.1981 శనివారం ఓ అమ్మకథ: (పవన్ ఇంటర్నేషనల్); సమర్పణ: ఎంవీఎల్; నిర్మాణ నిర్వహణ: కిరణ్ బాబు; నిర్మాతలు: వెల్లంకిజోషి, సీ.తిమ్మారెడ్డి,ఎస్ఆర్.వేజెళ్ళ; స్క్రీన్ ప్లే,దర్శకత్వం:వసంత్ సేన్; సహకారదర్శకుడు:గుమ్మడిశ్రీనివాసరావు;సంగీతం:బాలసుబ్రహ్మణ్యం; కథ:వసంతసేన్దాసంగోపాలకృష్ణ; మాటలు: దాసంగోపాలకృష్ణ;పాటలు:దాసంగోపాలకృష్ణ, .రామకృష్ణ,నూతనరచయిత్రి శ్రీమతిజ్యోతిర్మయి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, జానకి, శైలజ; నృత్యాలు:శివసుబ్రహ్మణ్యారాజు; కూర్పు:కే.బాబూరావు; పోరాటాలు: కే ఎస్. బాబూరమేష్, భూమయ్య; కళ: చంద్ర; ఛాయాగ్రహణం: జే.సత్యనారాయణ; తారాగణం: నూతన్ ప్రసాద్ (ద్విపాత్రాభినయం), శారద, జానకి, సావిత్రి, అనుపమ, మాధవీలత, ధనలక్ష్మి, సత్యవతి, రమాప్రభ, పీఎల్.నారాయణ, ప్రసాద్ బాబు, డాక్టర్ శివప్రసాద్; సురేష్, నూతననటుడు: పండు; అతిథినటుడు:రాళ్ళపల్లి, (1981 ఏప్రిల్ 16న సెన్సార్ సర్టిఫికేట్ మంజూరైంది )

kondaveeti-simha-175-dayskondaveeti-simham-100-dayskondaveeti-simham-200-days07.10.1981 బుధవారం కొండవీటి సింహం (రోజా మూవిస్) నిర్మాతలు: ఎం.అర్జునరాజు, కే.శివరామరాజు; నిర్వహణ: కుమార్జీ ; స్క్రీన్ ప్లే,దర్శత్వం:కే.రాఘవేంద్రరావు; అసోసియేట్ డైరెక్టర్: వీఎస్.రెడ్డి; సంగీతం:చక్రవర్తి; నృత్యాలు:సలీం; పోరాటాలు: సాంబశివరావు; కథ: జే.మహేంద్రన్; మాటలు:సత్యానంద్; పాటలు:వేటూరిసుందరామూర్తి; నేపథ్యగానం: సుశీల,బాలసుబ్రహ్మణ్యం; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కళ:భాస్కరరాజు; కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు;తారాగణం: ఎన్టీఆర్, శ్రీదేవి, జయంతి, గీత, సుభాషిణి, పుష్పలత, మోహన్ బాబు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నాగేష్, యూసుఫ్ ఖాన్, బుడేఖాన్, చలపతిరావు, ఆనందమోహన్, జగ్గారావు, భీమరాజు, పీజే.శర్మ, చిడతల అప్పారావు, జగ్గు, ఝాన్సీ, శ్రీలక్ష్మి, నీలవేణి, గిరిజారాణి, మాస్టర్ హరి; అతిథినటులు: కాంతారావు, త్యాగరాజు, ముక్కామల, సత్యనారాయణ,(ఈ సినిమాకు అక్టోబర్ 3న సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.1974 లో విడుదలైన తమిళ చిత్రం తంగపథకంఆధారంగా నిర్మించిన ఈ సినిమా మొదటి ౫౦ రోజుల్లోనే ఎన్టీఆర్ నటించిన వేటగాడు కలెక్షన్ రికార్డు ను బద్దలు గొట్టింది 1982 జనవరి 1437 కేంద్రాల్లో శతదినోత్సవం, మార్చి 3115కేంద్రాల్లో రజతోత్సవం చేసుకున్నది. ఏప్రిల్ 24 నాటికీ హైదరాబాద్, శ్రీకాకుళం, విజేశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో ద్విశత దినోత్సవం (200 రోజులు) పూర్తిచేసుకుంది.

girijaa-kalyanam16.10.1981 శుక్రవారం గిరిజాకల్యాణం (శ్రీకాంత్ పిక్చర్స్) సమర్పణ: సుందర్ లాల్ నహతా; నిర్మాత: శ్రీకాంత్ నహతా; దర్శకుడు: కేఎస్ఆర్.దాస్; కోడైరెక్టర్: బీఎల్వీ.ప్రసాద్; సంగీతం: సత్యం; నృత్యాలు శీను; కళ: బీ.చలం; కథ: యద్దనపూడిసులోచనారాణి; మాటలు:డీవీ.నరసరాజు; పాటలు: వేటూరిసుందరరామమూర్తి, గోపి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, వాణీ జయరామ్, శైలజ; ఛాయాగ్రహణం: ఎస్వీ.శ్రీకాంత్; కూర్పు: డీ.వెంకటరత్నం; తారాగణం: శోభన్ బాబు, జయప్రద, రంగనాథ్, సుమలత, సుభాషిణి, సుమంగళి, గీత, ఝాన్సీ, సత్యనారాయణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, త్యాగరాజు, త్యాగరాజు, సారథి, అల్లు రామలింగయ్య,రావికొండలరావు, హరిబాబు, కేకే.శర్మ, గోకిన రామారావు, వల్లం నరసింహారావు, హరిబాబు, మాస్టర్ రాజు; (ఈ సినిమాకు అక్టోబర్ 5న సెన్సార్ సర్టిఫికెట్ మంజూరైంది)

antham-kadidi-aarambham16.10.1981 శుక్రవారం అంతం కాదిది ఆరంభం (విజయకృష్ణా మూవీస్) సమర్పణ: నటశేఖర కృష్ణ; నిర్మాత: ఎస్.రామానంద్; సహనిర్మాత: ఎస్.రఘునాథ్; నిర్వహణ: ఎస్.రవికుమార్; స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజయ నిర్మల; సంగీతం:రమేష్ నాయుడు; నృత్యాలు:శ్రీనివాస్;కథ: హెచ్.కే.అనంతరావు; మాటలు:మోదుకూరిజాన్సన్; పాటలు:వేటూరిసుందరరామమూర్తి; నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ; కూర్పు :ఆదుర్తిహరనాథ్; ఛాయాగ్రహణం:లక్ష్మణ్ గోరె, పుష్పాల గోపికృష్ణ; తారాగణం:కృష్ణ, విజయ నిర్మల, సత్యనారాయణ,త్యాగరాజు, ముక్కామల, రవికాంత్, జ్యోతిలక్ష్మి, జయమాలిని, సుభాషిణి, ఫణి, కృష్ణకుమారి, వెన్నిరాడైనిర్మల, జగ్గారావు, టెలిఫోన్ సత్యనారాయణ, వల్లం నరసిమహారావు; ప్రత్యేకపాత్రలో: జగ్గయ్య,అతిథినటులు: కాంతారావు,నాగభూషణం, మిక్కిలినేని, రాజబాబు, గిరిబాబు, మిక్కిలినేని. జీవీ.కృష్ణారావు, నూతననటుడు: సుందరకృష్ణఅర్స్ ,

priya-81082123.10.1981 శుక్రవారం ప్రియ (ప్రభు చిత్రాలై) నిర్మాత: ఎం.రాయపరాజు; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్పీ.చిట్టిబాబు; అసోసియేట్ డైరెక్టర్: ఎస్ఆర్.కృష్ణ; సంగీతం: చక్రవర్తి; కథ: భాగ్యరాజా; మాటలు: ఆత్రేయ; పాటలు: ఆత్రేయ, నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం,సుశీల, జానకి; నృత్యాలు: శీను; ఛాయాగ్రహణం: జే.విల్లియమ్స్; కూర్పు: డీ.రాజగోపాల్; తారాగణం: తారాగణం: చిరంజీవి, రాధిక (తొలితెలుగుచిత్రం), చంద్రమోహన్, స్వప్న, పీజే.శర్మ, కేవీ.చలం, శివకుమార్, ఆశాదేవి, జీఎన్.స్వామి, సాక్షిరంగారావు, మాలి, శ్రీరాజ్, జెమినీ రాజేశ్వరి, బిందుమాధవి, ఆశాదేవి, మాస్టర్ అనిల్ కుమార్, మాస్టర్ విజ్జి ( మార్చి 20న సెన్సార్ సర్టిఫికేట్ మంజూరైన ఈ చిత్రాన్ని మార్చి 27నే విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. ఆతర్వాత అక్టోబర్ 16 అన్నారు. చివరకు అక్టోబర్ 23న విడుదల చేయగలిగారు)

nepal-gudachari-99923.10.1981 శుక్రవారం నేపాల్ గూఢచారి 999 (విజేత మూవీస్ కన్నడ డబ్బింగ్) సమర్పణ : దేసు వెంకట సుబ్బారావు; నిర్మాత: జీఎస్వీ.రావు; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దొరై భగవాన్; సంగీతం: జీకే.వెంకటేష్; ఛాయాగ్రహణం: పీఎస్.ప్రకాష్; కూర్పు: పీ.భక్తవత్సలం; తారాగణం: రాజకుమార్, పద్మప్రియ, చంద్రలేఖ, రాజి, వజ్రముని, తూగుదీప శ్రీనివాస్, టైగర్ ప్రభాకర్, ఎంబీ.శెట్టి(ఈ చిత్రం కన్నడ మాతృక ఆపరేషన్ డైమండ్ రాకెట్ 1978 ఆగష్టు 5 న విడుదలైంది. ఈ చిత్రాన్ని నేపాల్ లో చిత్రీకరించారు. విదేశాల్లో చిత్రీకరించిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది)o-inti-katha

29.10.1981 గురువారం ఓఇంటికథ(శ్రీలక్ష్మీబాలాజీచిత్ర తమిళడబ్బింగ్) నిర్మాత:పీ.మధుసూదనరావు; దర్శకుడు:ఎస్పీ.ముత్తురామన్; సంగీతం: ఇళయరాజా; కథ:పంజుఅరుణాచలం; మాటలు,పాటలు:రాజశ్రీ; నేపథ్యగానం:సుశీల, బాలసుబ్రహ్మణ్యం; ఛాయాగ్రహణం: బాబు; కూర్పు: ఆర్.విఠల్, టీ.కే.రాజన్; తారాగణం:రజనీకాంత్, జయలక్ష్మి, సంగీత, తిలక్, చోరామస్వామి, తెంగైశ్రీనివాసన్, జయ, మల్లిక; ఈ చిత్రానికి తమిళ మాతృక ఆరిలిరుంతు అరుబత్తువరై” 1979 సెప్టెంబర్ 14న విడుదలయింది. ఇదేకథతో శోభన్ బాబు హీరో గా మహారాజు పేరిట 1985 లో పునర్నిర్మితమైంది.

chattaaniki-kallu-levu-100-dayschattaaniki-kallu-levu30.10.1981 శుక్రవారం చట్టానికికళ్ళులేవు(శ్రీకర్ ప్రొడక్షన్స్) సమర్పణ;అట్లూరు పూర్ణచంద్రరావు; నిర్మాత:వంకినేనిసత్యనారాయణ, దర్శకత్వం: ఎస్ఏ.చంద్రశేఖర్; అసోసియేట్ డైరెక్టర్: ఎం.రామకృష్ణ; సంగీతం:కృష్ణచక్ర; కథ:శోభ; మాటలు,పాటలు: మైలవరపుగోపి; నేపథ్యగానం:బాలసుబ్రహ్మణ్యం; సుశీల, నృత్యాలు: బాబు; పోరాటాలు: ఆంబూర్ బాబు; కళ: శాయికుమార్; ఛాయాగ్రహణం: డీడీ.ప్రసాద్; కూర్పు: గౌతమ్ రాజు; తారాగణం: చిరంజీవి, మాధవి, లక్ష్మి, నారాయణరావు, రమణమూర్తి, పీజే.శర్మ, రావి కొండలరావు, సారథి, మాడావెంకటేశ్వరరావు, మల్లాది, అంజాద్, కుమార్, ధం, కన్నడ ప్రభాకర్, సిలోన్ మనోహర్, హేమసుందర్, పండరీబాయి జయశీల, జయపద్మ, నీలిమ, మాస్టర్ మధు, బేబీ వరలక్ష్మి, అతిదినటుడు: ప్రభాకరరెడ్డి, (అక్టోబర్ 20న ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ లభించగా ట అక్టోబర్ 30న విడుదల చేశారు. ఈ చిత్రం 1982 ఫిబ్రవరి 7న హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు (10) కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది శత దినోత్సవ వేడుకలు హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగాయి. )

satyabhama-100-dayssatyabhama31.10.1981 శనివారం సత్యభామ (శ్రీసరసమూవీస్)సమర్పణ: కేవీఆర్.చౌదరి; నిర్మాత: కే.సారథి; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కే.రాఘవేంద్రరావు; సంగీతం: చక్రవర్తి; ఛాయాగ్రహణం: కేఎస్.ప్రకాష్; కథ: కే.భాగ్యరాజ్; మాటలు : సత్యానంద్; పాటలు:వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; కళ: శ్రీనివాసరాజు; కూర్పు: కోటగిరివెంకటేశ్వరరావు; తారాగణం : జయసుధ, చంద్రమోహన్, కాంతారావు, అల్లు రామలింగయ్య, (ఇది 1981 జనవరి 23 విడుదలైన తమిళ చిత్రం మౌన గీతంగళ్” కు తెలుగు రీమేక్. ఈ చిత్రం 1982 ఫిబ్రవరి 7 శతదినోత్సవం చేసుకుంది.)

guvvala-janta06.11.1981 శుక్రవారం గువ్వల జంట (రాధా కృష్ణ మూవీస్) సమర్పణ: కృష్ణంరాజు; నిర్మాత: జీ.సత్యనారాయణరాజు; నిర్మాణ నిర్వహణ: యూవీ.సూర్యనారాయణరాజు; దర్శకుడు: కే.వాసు; సంగీతం: జేవీ. రాఘవులు; కథ: జరాసంధ్; మాటలు: ఆత్రేయ; పాటలు: ఆరుద్ర, వేటూరి నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, శైలజ; నృత్యం రాజు; పోరాటాలు రాఘవులురాజు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం:పీఎన్.సుందరం; కూర్పు: జీజీ.కృష్ణారావు; తారాగణం: కృష్ణంరాజు, జయసుధ, ప్రభాకరరెడ్డి, రంగనాథ్ (తొలిసారి విలన్ పాత్ర), సారథి, ప్రసాద్ బాబు, టెలిఫోన్ సత్యనారాయణ, పుష్పలత, శీతలత, శ్రీలక్ష్మి, భీమరాజు, ఆనందమోహన్, జగ్గారావు, చలపతిరావు, చిడతల అప్పారావు, నవీన, లక్ష్మిషా, ఆశాలత (ఈ చిత్రానికి నవంబర్ 3న సెన్సార్ సర్టిఫికేట్ లభించింది )

addalameda07.11.1981 శనివారం అద్దాలమేడ (విజయశ్రీ ఆర్ట్ పిక్చర్స్) నిర్మాత: అంజనీకుమార్; నిర్వహణ, సహనిర్మాత: ఏపీ.రంగారావు; కథ, మాటలు, దర్శకుడు:దాసరినారాయణరావు; కోడైరెక్టర్:సీవీ.రమణబాబు; సంగీతం:రాజన్నాగేంద్ర; కథాసహకారం:ఆర్కే.ధర్మరాజు; పాటలు:రాజశ్రీ,దాసరినారాయణరావు; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి; నృత్యాలు:సలీంరాజు; కళ:భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.మణి; కూర్పు:జీజీ.కృష్ణారావు; తారాగణం: దాసరినారాయణరావు, మురళీమోహన్, జయసుధ,మోహన్ బాబు, గీత, అంబిక, సంగీత, ప్రభాకరరెడ్డి, ఆర్కే.ధర్మరాజ్, మాలి, కేవీ.చలం, రమాప్రభ, అన్నపూర్ణ, ఝాన్సీ, జయవిజయ, జయశీల, గోకినరామారావు, మద్దాలరామారావు, నళినీకాంత్, మాస్టర్ పురుషోత్తం, రవి (ఈ చిత్రానికి నవంబర్ 4న సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.)mayadari-alludu

12.11.1981 గురువారం మాయదారి అల్లుడు( జివీకే ప్రొడక్షన్స్) నిర్మాత; నవభారత్ బాబురావు; దర్శకుడు: కేఎస్ఆర్.దాస్; సంగీతం: జేవీ రాఘవులు; మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ; తారాగణం: కృష్ణ, జయప్రద జగ్గయ్య, శ్రీధర్, గీత, ఝాన్సీ, సత్యనారాయణ, గిరిబాబు, అల్లు రామలింగయ్య, రాజబాబు, జయభాస్కర్, హేమసుందర్, హరిబాబు, సమర్పణ: నారాయణరెడ్డి;

bhakthudu-bhaga-vanthudu13.11.1981 శుక్రవారం భక్తుడు  భగవంతుడు 

13.11.1981 శుక్రవారం దేవతల కళ్యాణము (శ్రీ రాజరాజేశ్వరి సినీ ఎంటర్ ప్రైజస్) devaala-kalya-namuసమర్పణ: తమిరి పంకజ మాలిక్; నిర్మాత: యూ.రామకృష్ణారావు; దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు; సంగీతం కేవీ.మహదేవన్, (ఈ చిత్రానికి తమిళ మాతృక దైవ తిరుమానంగల్కాగా మూడు భాగాలుగా ఉండే ఈ సినిమాలో మీనాక్షి కళ్యాణంవిభాగానికి పీ.నీలకంఠన్ దర్శకత్వం వహించగా, కేవీ.మహదేవన్ సంగీతం సమకూర్చారు. “వల్లీ తిరుమానంవిభాగానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా జీకే.వెంకటేష్ సంగీతం అందించారు. శ్రీనివాస కళ్యాణం విభాగానికి కే.శంకర్ దర్శకత్వం వహించగా ఎంఎస్.విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించారు.) తారాగణం: చంద్రమోహన్, రవి, లత, తారాగణం: చంద్రమోహన్, రవి, లత, శ్రీవిద్య, శ్రీదేవి, శ్రీప్రియ, వెన్నిరాడై నిర్మల, ఫటాఫట్ జయలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, నంబియార్, శీర్ఘాళీ గోవిందరాజన్;

simhaswapnam13.11.1981 శుక్రవారం సింహస్వప్నం (కార్తికేయ పిక్చర్స్) కథ, సమర్పణ: పీ.నారాయణ; నిర్మాత: పీకే.ప్రసరకుమార్; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పీ.దుర్గాప్రసాద్; అసోసియేట్ దర్శకుడు: ఎం.బాలు; సంగీతం: దేవదాస్ కోటే; నృత్యాలు: రాజుశేషు; పోరాటాలు:రమేష్; కళ: గిరి; ఛాయాగ్రహణం:ఉదయరాజ్; మాటలు:విజయరత్నం; పాటలు: విజయరత్నం, మాదే ప్రభాకర్; నేపథ్యగానం: జానకి, ఎల్ఆర్.ఈశ్వరి, రామకృష్ణ, ఆనంద్, మాదే ప్రభాకర్, చంద్రబాల; కూర్పు: నరసింహారావు; తారాగణం: నరసింహరాజు, కే.విజయ, లీల, రమణమూర్తి, ఆనందమోహన్, చిట్టిబాబు, శ్యామ్(ఇన్ ష్టిట్యూట్), ఫైటర్ శ్యామ్, శ్రీనివాస్, కల్పనారాయ్, సూర్యకుమారి, రమాదేవి, హేమ, నూతననటుడు: ఎస్.కే.బాషా (ఈ చిత్రానికి నవంబర్ 10న సెన్సార్ సర్టిఫికెట్ మంజూరైంది).

13.11.1981 శుక్రవారం సిసింద్రీలు చిచ్చుబుడ్డి (శ్రీ విఘ్నేశ్వర సినీ ఆర్ట్ క్రియేషన్స్) సమర్పణ: దేసు వెంకట సుబ్బారావు; sisindreelu-chicchubuddiనిర్మాతలు:ఎస్వీ సుబ్బారావు, కే.రామకోటయ్య; దర్శకుడు: గీతప్రియ; మూలకథ: ఎంకే.బాలాజీసింగ్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు: హెచ్.వీ.సుబ్బారావు; సంగీతం: ఉపేంద్రకుమార్, వేలూరికృష్ణమూర్తి; నృత్యాలు: ఉడుపి బీ.జయరాం, దేవి; ఛాయాగ్రహణం:పీఎస్.ప్రకాష్, కులశేఖర; కూర్పు: కే.బాలు; తారాగణం: కరాటే మాస్టర్ రామకృష్ణ హెగ్డే(నూతన బాలనటుడు), మాస్టర్ భానూప్రకాష్, బేబీ ఇందిర, శ్రీనాథ్, అంబరీష్, ఉదయకుమార్, అనంతరామ్, మంజుల, శక్తిప్రసాద్, సుందరకృష్ణ అర్స్, టైగర్ ప్రభాకర్, ఎంఎస్.ఉమేష్; ప్రత్యేక ఆకర్షణలు: లక్కీ (కుక్క), సావిత్రి (కోతి) మాస్టర్ జేమ్స్; అతిథినటులు: కేఎస్.అశ్వత్థ, రాజానంద్ (ఈ బాలల చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన ఉదయం ఆటలుగా మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అనివార్యకారణాలవల్ల 13వ తేదీ నాలుగు ఆటలుగా విడుదలచేశారు. దీనికి కన్నడ మూలం 1979 మార్చి13న విడుదలైన పుఠాణి ఏజెంట్-123″  చిత్రం )

dabbu-dabbu-dabbu20.11.1981 శుక్ర వారం డబ్బు!డబ్బు!డబ్బు! (శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్) స్క్రీన్ ప్లే, నిర్మాణత: విజయ బాపినీడు; నిర్మాత:మాగంటి రవీంద్రనాథ్ చౌదరి; దర్శకుడు:జీ.రామ్మోహనరావు; సంగీతం:శ్యామ్; కూర్పు:కే.సత్యం; మాటలు:సత్యానంద్; స్క్రిప్ట్ : ఆత్రేయ, కాశీవిశ్వనాథ్, ఆకెళ్ల; ఛాయాగ్రహణం:ఎస్.గోపాలరెడ్డి; పాటలు: ఆత్రేయ, వేటూరి, వీటూరి; నృత్యాలు: శివసుబ్రహ్మణ్యారాజు, ప్రమీల; కళ: కళాధర్; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, టీఎం.సౌందర్ రాజన్, ఆనంద్, సుశీల, జానకి, రమణ; తారాగణం: మురళీమోహన్, రాధిక, మోహన్ బాబు, ప్రతాప్ పోతన్, ప్రభ, ప్రభాకరరెడ్డి, రమాప్రభ, నూతన్ ప్రసాద్ , రాజసులోచన, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, పొట్టివీరయ్య, బాబ్జి, ఎస్వీ.రమణ, సుబ్బారావు, లక్ష్మణరావు, హరిప్రియ, అతిథినటులు: ఈశ్వరరావు, సత్యకళ (ఈ చిత్రానికి నవంబర్ 10న సెన్సార్ సర్టిఫికెట్ మంజూరైంది.)

mahaa-purushudu21.11.1981 శనివారం మహాపురుషుడు (ఆదిత్యచిత్ర) కథ, సమర్పణ: వీ.మహేష్; స్క్రీన్ ప్లే , దర్శకత్వం: పీ.లక్ష్మిదీపక్; ర్మాత: వీ.రోహిణి; నిర్మాణ నిర్వహణ:వీ.మోహన్ రావు; సంగీతం: చక్రవర్తి; మాటలు: జంధ్యాల; పాటలు: గోపి, వేటూరి, నారాయణరెడ్డి; నేపథ్యగానం : బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, ఆనంద్; నృత్యాలు: సలీం, శేషు; పోరాటాలు: సాంబశివరావు; కళ: రాజేంద్రకుమార్; ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప ; కూర్పు: కేఏ.మార్తాండ్; తారాగణం: ఎన్టీఆర్, జయసుధ; సుజాత, మురళీమోహన్, సత్యనారాయణ, మమత, సూర్యకాంతం, జయమాలిని, పీఎల్.నారాయణ, పద్మనాభం, జగ్గారావు, జయపద్మ, జయప్రభ, సుశీల, శ్రీశాంతి, చందన, మాస్టర్ మధుబాబు, ఏచూరి, అతిథినటులు: ప్రభాకరరెడ్డి, ఈశ్వరరావు.pakkinti-ammaayi

27.11.1981 శుక్రవారం పక్కింటిఅమ్మాయి(నాగార్జునప్రొడక్షన్స్) సమర్పణ:కేసీ.శేఖర్ బాబు; నిర్మాత: .సారథి; దర్శకుడు: కే.వాసు; సంగీతం : చక్రవర్తి; కథ: అరుణ్ చౌధురి; మాటలు: సత్యానంద్; పాటలు: ఆరుద్ర, వేటూరి, గోపి ; ఛాయాగ్రహణం : ఎస్. గోపాలరెడ్డి; తారాగణం: చంద్రమోహన్, జయసుధ, బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి, సారథి, మాడా వెంకటేశ్వరరావు, హేమసుందర్, ప్రభాకరరెడ్డి, ఝాన్సీ, విజయలక్ష్మి, మేకప్ రామకృష్ణ, సత్యం (1952 లో విడుదలైన బెంగాలీ చిత్రం పాశేర్ బారితెలుగు రీమేక్. ఈ చిత్రంలో సంగీతం మాస్టారుగా నటించిన చక్రవర్తి ఇందులో మొదటిసారి పూర్తిపాట పాడడం విశేషం)

maa-voori-pedda-manushulu-81111627.11.1981 శుక్రవారం : మాఊరి పెద్దమనుషులు(బాలాజీఆర్ట్స్) నిర్మాత: పీ.బాలాజీ; రచన, దర్శకత్వం: పేరాల; సంగీతం:సత్యం; తారాగణం: నరసింహరాజు, నూతన్ ప్రసాద్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య (ఈ చిత్రాన్ని ఆగస్టులోనే విడుదలచేస్తామని జులై 3 శుక్రవారం ప్రకటించినప్పటికీ నవంబర్ 27 విడుదలచేశారు.)ganesha-mahima

27.11.1981 శుక్ర వారం గణేశ మహిమ: (భార్గవ విఠల్ ప్రొడక్షన్స్); నిర్మాతలు: ఎంఎస్ఆర్కే.విఠల్, టీ.నారాయణరెడ్డి; సమర్పణ: కే సత్యనారాయణ; దర్శకుడు: కే.మానిమురుగం; సంగీతం: ఎం ఎస్ విశ్వనాథన్; ఛాయాగ్రహణం: హెచ్.జీ.రాజు; తారాగణం: అశోక్, ఆరతి, సుందరకృష్ణ అర్స్, ముసురు కృష్ణమూర్తి, ఉపాసన సీతారాం, చేతన రామారావు, బీఎంవెంకటేష్, శ్రీలలిత, సుధారాణి, బేబీ రేఖ. బేబీ మమత, మాస్టర్ అర్జున్, అతిథి నటులు: ఎంపీ.శంకర్, టైగర్ ప్రభాకర్, రామకృష్ణ, ;

radhakalyanam-100-daysraadhaa-kalyanam03.12.1981 గురువారం రాధాకల్యాణం (శ్రీసారథి స్టూడియోస్); నిర్మాతలు: GD.ప్రసాదరావు, పీ.శశిభూషణ్; దర్శకుడు: బాపు; సంగీతం : కేవీ మహదేవన్, కథ: భాగ్యరాజా; మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ, పాటలు: నారాయణరెడ్డి; ఛాయాగ్రహణం: బాబా అజ్మి; తారాగణం: చంద్రమోహన్, రాధిక, శరత్ బాబు, కాంతారావు, రావి కొండలరావు, రాధాకుమారి, పుష్పలత, సాక్షి రంగారావు, మాస్టర్ రాజన్, మాస్టర్ వంశీకృష్ణ అతిథినటుడు: చిరంజీవి; (ఈ చిత్రం 1982 మార్చ్ 14 హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ కేంద్రాల్లో వందరోజులు పూర్తిచేసుకోగా విజయవాడ అలంకార్ థియేటర్లో శతదినోత్సవ వేడుకలు జరిగాయి. సభకు కృష్ణ అధ్యక్షతవహించగా చిత్రనిర్మాణం. పంపిణీ, ప్రదర్శనలో పాల్గొన్నవారికి కమల్ హాసన్ జ్ఞాపికలను అందజేశారు.

vaaraalabbayi04.12.1981 శుక్రవారం వారాలబ్బాయి(జయభేరిఆర్ట్ మూవీస్) సమర్పణ: మురళీమోహన్; నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు; మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రాజాచంద్ర; కోడైరెక్టర్: పీ.రవీంద్రబాబు; సంగీతం: చక్రవర్తి; కథ:వసుంధర; రచనాసహకారం: పూసల; పాటలు: జాలాది; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: తార; పోరాటాలు: రాజు; కళ: రంగారావు; ఛాయాగ్రహణం: ఉదయరాజ్; కూర్పు: డీ.రాజగోపాల్; తారాగణం: మురళీమోహన్, మాధవి, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, గిరిబాబు, షావుకారు జానకి, కృష్ణవేణి, కే.విజయ, జయవిజయ, జయశీల, విజయసాధన, ప్రసాద్ బాబు, మాగంటి వెంకటేశ్వరావు, మాస్టర్ సురేష్; (ఈ చిత్రానికి నవంబర్ 27న సెన్సార్ సర్టిఫికేట్ మంజూరైంది)

alludu-garu-zindabad11.12.1981 శుక్రవారం అల్లుడుగారు జిందాబాద్ (సుమన్ క్రియేషన్స్)సమర్పణ: ఎం.రామకృష్ణారెడ్డి; నిర్మాత: ఎం.శ్యామలారెడ్డి; కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కట్టా సుబ్బారావు; సహకారదర్శకుడు:యడ్ల నాగేశ్వరరావు; సంగీతం: చక్రవర్తి; మాటలు: గొల్లపూడి మారుతీరావు; పాటలు: వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్; కళ: భాస్కరరాజు; నృత్యాలు: తార; పోరాటాలు: పరమశివంరాజు; ఛాయాగ్రహణం: పీ.చంగయ్య; కూర్పు: నరసింహారావు; తారాగణం:శోభన్ బాబు, శారద, గీత, సువర్ణ, గుమ్మడి, సత్యనారాయణ, జేవీ రమణమూర్తి, పీఎల్.నారాయణ, కాకరాల, మమత, శ్యామల, జయమాలిని; అతిథినటులు: ప్రభాకరరెడ్డి, మాడావెంకటేశ్వరావు, కబీర్ దాస్, సీహెచ్.కృష్ణమూర్తి; (ఈ చిత్రానికి డిసెంబర్ 3న సెన్సార్ సర్టిఫికేట్ లభించింది)ramapuramlo-seetha

12.12.1981 శనివారం రామాపురంలో సీత (ఆర్కే మూవీస్)సమర్పణ: రామకృష్ణ; నిర్మాతలు: జీ. గణేశన్, జీ.శ్రీనివాసన్; దర్శకుడు: ధవళ సత్యం; సంగీతం: జేవీ రాఘవులు; పాటలు: ఆరుద్ర, నారాయణరెడ్డి, ధవళ సత్యం; తారాగణం: రామకృష్ణ, సుజాత, చంద్రమోహన్, పీఎల్.నారాయణ,పుష్పకుమారి, సాక్షి రంగారావు, చిట్టిబాబు, రమాప్రభ, మమత, జీవా, సీతాలత (కన్నడలో 1979 హిట్ చిత్రం చందద గొంబెకు ఇది తెలుగు రీమేక్ ).

minister-maalakshmi17.12.1981 గురువారం మినిస్టర్ మాలక్ష్మి (మిత్రా ప్రొడక్షన్స్) నిర్మాతలు: గూడవల్లి బాపయ్య చౌదరి , డాక్టర్ పద్మనాభం; దర్శకుడు : ఎం.రంగారావు; సహకారదర్శకుడు: పీ.బాబు, కథ,మాటలు: రాజా శివానంద్; సంగీతం:బి.మాధవరావు; నృత్యాలు: రణధీర్, పోరాటాలు: బాబూరమేష్, కళ: పీ.సాయికుమార్; పాటలు: జాలాది, విజయరత్నం; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, సుశీల, శైలజ, వసంత, ఘంటసాల జూనియర్ సింగర్ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: పీ.లక్ష్మణ్; కూర్పు: జీ.మధు; తారాగణం: జయంతి, నూతన్ ప్రసాద్, నరసింహరాజు, ఈశ్వరరావు, ప్రసాద్ బాబు, శ్రీధర్, పద్మనాభం, చిట్టిబాబు, శ్రీగీత , కృష్ణవేణి, ఇందిర, సుశీల, జ్యోతిచిత్ర, విజయలక్ష్మి, మాడా వెంకటేశ్వరరావు;

811224-nomula-panta24.12.1981 గురువారం నోములపంట (మారుతి ఆర్ట్ ప్రొడక్షన్స్) నిర్మాతలు : గోవిందరాజు శ్రీనివాసరావు, పీ.సరళ; నిర్మాణ నిర్వహణ : ఎం.మణిఅయ్యర్; దర్శకుడు: పీ.శేఖర్; సహకారదర్శకుడు: ఎంపీ.ఆంజనేయులు; సంగీతం: సత్యం; నృత్యాలు: వసంతకుమార్; మాటలు: భరత్; పాటలు: ఆత్రేయ, వీటూరి, గోపి, భరత్; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, శైలజ; పోరాటాలు: భాషా; ఛాయాగ్రహణం: కులశేఖర్; కళ: వాలి; కూర్పు: చంద్రశేఖర్; తారాగణం: చంద్రమోహన్, నూతననటి చేతన, నూతన్ ప్రసాద్, ప్రభాకరరెడ్డి, జయమాలిని, ప్రసాద్ బాబు, సిలోన్ మనోహర్, నిర్మల, గిరిజారాణి, పుష్ప, ఉమ, శ్యామల, చంద్రలేఖ, జయశీల, కల్పనారాయ్, లక్ష్మి, సరోజ, రజని, మాస్టర్ సురేష్ (ఈ చిత్రాన్ని తొలుత 17 తేదీ విడుదల చేయాలని తలపెట్టినప్పటికీ 24న విడుదల చేశారు.)

kirayi-rowdylu24.12.1981 గురువారం కిరాయి రౌడీలు (శ్రీ కాంతి చిత్రా)నిర్మాత: టి.క్రాంతికుమార్; దర్శకుడు: .కోదండరామిరెడ్డి; కోడైరెక్టర్: విజయభాస్కర్; సంగీతం: చక్రవర్తి; రచన: సత్యానంద్; పాటలు: వేటూరి సుందరరామమూర్తి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నూతనగాయనిఅనితారెడ్డి(మద్రాస్ టీవీపాప్ సింగర్) నృత్యాలు: సలీం; పోరాటాలు: రాజు; కళ:భాస్కరరాజు; ఛాయాగ్రాణం:.వెంకట్; కూర్పు:బీ.కృష్ణంరాజు; తారాగణం: చిరంజీవి, రాధిక, మోహన్ బాబు, రావు గోపాలరావు, ప్రభాకరరెడ్డి, జగ్గారావు, సువర్ణ, వనిత; అత్తిలి లక్ష్మి, అతిథి నటుడు: అల్లురామలింగయ్య;vadanimalli-820102

25.12.1981 శుక్రవారం వాడని మల్లి (ఏ వీ ఎం మురుగన్ అండ్ కో) నిర్మాత, దర్శకుడు: ఏవీఎం మురుగన్; సమర్పణ: విమలాదేవి; సంగీతం: సత్యం; కథ,మాటలు:ఎంవీఎస్.హరనాథ్(చీకటోళ్లు నవల ఆధారంగా); పాటలు: వేటూరి, గోపి; తారాగణం: సుప్రియ, కళారాణి, అన్నపూర్ణ, రమాదేవి, శ్రీలక్ష్మి, రాధ, కల్పన, నందకుమార్, చౌదరిబాబు, దినకర్, టెలిఫోన్ సత్యనారాయణ, రాఘవయ్య, శ్రీహరి, విశ్వేశ్వరరావు , విజయకుమార్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


  (To Type in English, deselect the checkbox. Read more here)