పాత తెలుగుసినిమాల వివరాలు, విశేషాలు 1980 (నాలుగో భాగం)

02.10.1980 గురువారం సీమటపాకాయి 123 (కళామందిర్ ఫిలింస్ వారి కన్నడ డబ్బింగ్ ) దర్శకుడు : గీతప్రియ; సంగీతం: రాజన్ నాగేంద్ర; తారాగణం: నరసింహరాజుseematapakaya

madana-manjari-80093003.10.1980 శుక్రవారం మదనమంజరి (విఠల్ ప్రొడక్షన్స్); సమ్పర్పణ , నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బీ.విఠలాచార్య;  సంగీతం: విజయకృష్ణమూర్తి; నృత్యాలు: శేషు; పోరాటాలు: బాషా; మాటలు: కర్పూరం ఆంజనేయులు; పాటలు, పద్య శ్లోకాలు : నారాయణరెడ్డి, కోట సత్యరంగయ్య శాస్త్రి. కొడాలి ఉమామహేశ్వరరావు; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, రఘురాం; కళ: కుదరవల్లి నాగేశ్వరరావు; ఛాయాగ్రహణం: హెచ్ఎస్.వేణు; కూర్పు: కే.గోవిందస్వామి; తారాగణం: రంగనాథ్, జయమాలిని, మిక్కిలినేని, ముక్కామల, ఎస్.వరలక్ష్మి, విజయలక్ష్మి, సారథి, బాలకృష్ణ, రాజేశ్వరి కేవీ.చలం, నాగరాజు, భీమరాజు, కాశీనాథ్ తాతా, మోదుకూరి సత్యం; కోతి (సావిత్రి) శిక్షకుడు జేమ్స్, పొట్టేలు (రాము) శిక్షకుడు వీరభద్రం ;

03.10.1980 శుక్రవారం బండోడుగుండమ్మ(విజయలక్ష్మీమూవీస్) కథ,మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు; నిర్మాత : జీవీఎస్.రాజు; సంగీతం: చక్రవర్తి; పాటలు: దాసరినారాయణరావు, రాజశ్రీ, వేటూరి నేపథ్యగానం: సుశీల. బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: సలీం; పోరాటాలు: రాఘవులు; కళ; భాస్కరరాజు; ఛాయాగ్రహణం: కన్నప్ప; కూర్పు: డీ.రాజగోపాల్; తారాగణం: కృష్ణ, జయప్రద, ప్రభ, జ్యోతిలక్ష్మి, సూర్యకాంతం, రావు గోపాలరావు అల్లు రామలింగయ్య, నిర్మల, కృష్ణవేణి, పీజే.శర్మ, మోదుకూరి సత్యం భావన, అతిథి నటులు హరిప్రసాద్, కేవీ చలం;ramudu-parusu-ramudu-nv-ad-801010

10.10.1980 శుక్రవారం రాముడుపరుశురాముడు (సురేష్ ఫైన్ ఆర్ట్స్) నిర్మాత: బి.భువనేశ్వరి, నిర్వహణ: బి.కృష్ణమూర్తి; దర్శకుడు: ఎం.ఎస్.గోపీనాథ్; సంగీతం: సత్యం; పాటలు: నారాయణ రెడ్డి. తారాగణం: శోభన్ బాబు, లత, రాయ్, త్యాగరాజు, గిరిబాబు 

11.10.1980 శనివారం రామాయణంలో పిడకలవేట (రాంశ్యాంక్రియేషన్స్) సమర్పణతాతినేనిసుబ్బారావు; నిర్మాత: టీకేఎంఛటర్జీ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్యాంజీశెయించర్; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజాచంద్ర;  ramayanamlo-pidakala-veta

సహకారదర్శకుడు:కేవీ.ఆంజనేయులు; సంగీతం: సత్యం; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: ramayanamlo-pidakala-veta-100-daysఉదయరాజ్; కూర్పు: కే.సత్యంమాటలు:కాశీవిశ్వనాథ్;పాటలు:ఆరుద్ర,జాలాది; నృత్యాలు:రవి; కూర్పు: కే.సత్యం; నేపథ్యగానం:జానకి,బాలసుబ్రహ్మణ్యం;నూతనగాయనీగాయకులు:బాజీరావు,రమణ; తారాగణం: మురళీ మోహన్, జయప్రద, దీప, గిరిబాబు, రావికొండలరావు, హేమసుందర్, రాళ్ళపల్లి, కే.విజయ, సావిత్రి, జానకి, ఝాన్సీ, రాజేశ్వరి, భానురాజా; అతిథినటులు: నూతన్ ప్రసాద్, సారథి; ( ఈ చిత్రం 1981 జనవరి 18న శతదినోత్సవం చేసుకుంది)

hare-krishna-hallo-radha-80101116.10.1980 గురువారం హరేకృష్ణ హల్లోరాధా (భరణీ చిత్రా ఎంటర్ ప్రైజెస్) నిర్మాత: బీ.భరణిరెడ్డి; నిర్వహణ: కన్నయ్య; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సీవీ.శ్రీధర్; సహకార దర్శకుడు: ఎన్.సీ.చక్రవర్తి; సంగీతం: విజయ భాస్కర్; మాటలు: వసంతకుమార్; పాటలు: వీటూరి, కొసరాజు; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం. రామకృష్ణ, సుశీల, వాణీజయరాం,ఎల్ఆర్.అంజలి; నృత్యాలు: సలీం; పోరాటాలు: రాఘవులు; కళ: బీ.సూర్యకుమార్; ఛాయాగ్రహణం: ఆర్కే తివారి; కూర్పు: చౌదుల సుబ్బారావు; తారాగణం: కృష్ణ, శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి, పండరీబాయి, శ్రీలక్ష్మి, జయమాలిని, ఆనందమోహన్, సత్తార్, ప్రకాష్; అతిథినటుడు: సత్యనారాయణ,

gopalarao-gaari-ammaayi-801012gopalarao-gari-ammaayi-100-days-80012417.10.1980 శుక్రవారం గోపాలరావు గారి అమ్మాయి (నాగార్జునాపిక్చర్స్) సమర్పణ: కేసీ.శేఖర్ బాబు; నిర్మాత: .సారథి; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కే.వాసు; సంగీతం: చక్రవర్తి; కథ: ఆదుర్తి నరసింహమూర్తి; మాటలు: సత్యానంద్; పాటలు: ఆరుద్ర, వేటూరి, గోపి; నేపథ్యగానం: సుశీల, శైలజ, బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్; నృత్యాలు: తార; కళ: తోట హేమచందర్; కూర్పు:నాయనిమహేశ్వరరావు, ఆదుర్తి నరసింహమూర్తి; ఛాయాగ్రహణం: ఎస్.గోపాలరెడ్డి; తారాగణం: చంద్రమోహన్, జయసుధ, రావు గోపాలరావు, నాగభూషణం. షావుకారు జానకి, మోహన్ బాబు; ఝాన్సీ, కే.విజయ, సారథి, సాక్షి రంగారావు, కాకరాల, చక్రవర్తి; (ఈ చిత్రం 1981 జనవరి 24న  శతదినోత్సవం జరిగింది)mangala-gowri-801017

18.10.1980 శనివారం మంగళ గౌరి (స్వామి అయ్యప్ప ఫిల్మ్స్) నిర్మాత : వాసిరెడ్డి నాగేశ్వరరావు; దర్శకుడు : గిరిధర్; సంగీతం: చక్రవర్తి; తారాగణం: మురళీమోహన్, శారద గిరిజ, పీఎల్. నారాయణ, హేమసుందర్,

menattha-kuturu-801009menattha-kuturu24.10.1980 శుక్రవారం మేనత్తకూతురు(సింహపురియునైటెడ్ ఆర్ట్స్) సమర్పణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొమ్మినేని; నిర్మాత: వాసిపల్లి; సంగీతం: చక్రవర్తి; మాటలు: జంధ్యాల; కళ: పింజల వెంకటేశ్వరరావు; ఛాయాగ్రహణం: బాలకృష్ణ; కూర్పు: కందస్వామి; తారాగణం: రంగనాథ్, మాధవి, మమత, లక్ష్మీకాంత్, రాజసులోచన, ఈశ్వరరావు, పద్మనాభం, వంకాయల, కాకరాల; (ఈ చిత్రం తొలుత 18వ తేదీ విడుదలవుతుందని ప్రకటించినప్పటికీ 24వ తేదీ నేడే బ్రహ్మాండమైన విడుదల అని హైదరాబాద్ నగరంలోని వేంకటేశ మీరా, విజయలక్ష్మి, సికింద్రాబాద్ లోని మనోహర్ థియేటర్ లో ప్రకటనలు కనిపిస్తాయి)

prema-tarangalu-80101924.10.1980 శుక్రవారం ప్రేమతరంగాలు(ప్రభు చిత్ర); నిర్మాత: ఎం.వీ.హెచ్.రాయపరాజు; స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్పీ.చిట్టిబాబు; సంగీతం: చక్రవర్తి; మాటలు: గొల్లపూడి మారుతీరావు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: విల్లియమ్స్; కూర్పు: రాజగోపాల్; తారాగణం: కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కాంతారావు, జయసుధ, సుజాత, సావిత్రి, ఝాన్సీ;singapore-lo-kiladeelu-801024

24.10.1980 శుక్రవారం సింగపూరులో కిలాడీలు (తరంగిణీ మూవీస్ ) నిర్మాతలు; పీ.శేషయ్య, విక్టర్ శివాజీరామ్, బీ.మన్మధరావు, పీ వెంకురెడ్డి; దర్శకుడు : సీవీ.రాజేంద్రన్; సంగీతం: రాజన్ నాగేంద్ర; కథ, స్క్రీన్ ప్లే ఎండీ.సుందర్; తారాగణం విష్ణువర్ధన్ద్వారకేష్మంజుల, ఫెలినా, లోకనాథ్, తూగుదీపః శ్రీనివాస్, శక్తిప్రసాద్; (ఈ చిత్రానికి కన్నడ మాతృక సింగపూరునల్లి రాజాకుళ్ల” 1978 డిసెంబర్ 23 విడుదలైంది.

sardar-paparayudu-801029sardar-paparayudu-81051730.10.1980 గురువారం సర్దార్ పాపారాయుడు (శ్రీ అన్నపూర్ణా ఇంటర్నేషనల్) నిర్మాత: క్రాంతికుమార్; కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : దాసరి నారాయణ రావు; కోడైరెక్టర్:సీవీ.రమణబాబు; సంగీతం: చక్రవర్తి; పాటలు: శ్రీశ్రీ, రాజశ్రీ, దాసరి నారాయణరావు; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం, బెనర్జీ; నృత్యాలు: సలీం; పోరాటాలు: సాంబశివరావు; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: ఎస్. వెంకటరత్నం; కూర్పు: జీజీ.కృష్ణారావు; తారాగణం: ఎన్టీఆర్, శారద, శ్రీదేవి, గుమ్మడి, సత్యనారాయణ, రావుగోపాలరావు, జ్యోతిలక్ష్మి, పండరీబాయి, అల్లు రామలింగయ్య, , అత్తిలి లక్ష్మి, త్యాగరాజు, కేవీ చలం, పీజే.శర్మ, చలపతిరావు, చిడతల అప్పారావు, అశోక్ కుమార్, అతిథి నటులు: ప్రభాకరరెడ్డి, ఎస్.వరలక్ష్మి, మోహన్ బాబు, (ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకోవడమే గాక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ద్విశతదినోత్సవం చేసుకోవడం, మరిన్ని రోజులు ప్రదర్శనకు నోచుకుని ఎన్నో రికార్డులు సాధించడాం గొప్ప విశేషం.)

maa-inti-devata01.11.1980 శనివారం మా ఇంటి దేవత (చిరంజీవి చిత్ర) నిర్మాతలు: మహమ్మద్ రంజాన్ అలీ, మహమ్మద్ ఖమ్రుద్దీన్; సమర్పణ: బోదులూరి రామారావు; దర్శకుడు : బి.పద్మనాభం; సంగీతం: మాష్టర్ వేణు; తారాగణం: కృష్ణ, జమున, హరనాథ్, రామకృష్ణ, పద్మనాభం, శాంతకుమారి, రమణమూర్తి, సత్యనారాయణ, మోహన్‌బాబుsubhodayam-801027

01.11.1980 శనివారం శుభోదయం (శ్రీరామ్ ఆర్ట్ పిక్చర్స్) సమర్పణ: జీజీ.కృష్ణారావు; నిర్మాత: సీహెచ్.నరసింహారావు; కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం :కే.విశ్వనాథ్; సంగీతం: కేవీ.మహాదేవన్; పాటలు: వేటూరి సుందర రామూర్తి; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు:శేషు; కళ:తోటహేమచందర్, ఛాయాగ్రహణం: కస్తూరి; తారాగణం: చంద్రమోహన్, సులక్షణ, చారుహాసన్, సాక్షి రంగారావు, మనోరమ, అన్నపూర్ణ భానుప్రకాష్; రాంబాబు, బేబీ మృదుల, బేబీ లత

bangaru-lakshmi-80110407.11.1980 శుక్రవారం బంగారులక్ష్మి(దేవర్ ఫిల్మ్స్)నిర్మాత:సీ.దండాయుధపాణి;నిర్వహణ:చిత్తూరుఆనందనాయుడు, రాధాకృష్ణ; కథ, దర్శకత్వం : ఆర్.త్యాగరాజన్; సంగీతం: చక్రవర్తి; మాటలు: జంధ్యాల; పాటలు: ఆత్రేయ, ఆరుద్ర; ఛాయాగ్రహణం:వీ.రామమూర్తి; తారాగణం:చంద్రమోహన్, జయసుధ, సంగీత, నిర్మల, గిరిబాబు, పండరీబాయి;

saradaa-ramudu-80111014.11.1980 శుక్రవారం సరదారాముడు (సైఫ్ ఎంటర్ ప్రైజెస్) నిర్మాత: ఎస్.రియాజ్ బాషా; స్క్రీన్ ప్లే దర్శకత్వం: కే.వాసు; సంగీతం: చక్రవర్తి; కథ : సుబోధ్ ముఖర్జీ; టలు: జంధ్యాల; పాటలు : వేటూరి సుందర రామూర్తి; నేపథ్యగానం: సుశీల బాలసుబ్రహ్మణ్యం; నృత్యాలు: సలీం; పోరాటాలు: సాంబశివరావు; కళ: భాస్కరరాజు, ఛాయాగ్రహణం: పీఎస్. సుందరం; కూర్పు: రవి : తారాగణం: ఎన్టీఆర్, జయసుధ, కవిత, ఎస్. వరలక్ష్మి, జయమాలిని,విజయలలిత, మోహన్ బాబు, రావు గోపాలరావు, ప్రభాకర రెడ్డి, కాంతారావు, చలపతిరావు, రాజబాబు, నగేష్,(ఇది 1961 హిందీ హిట్ చిత్రం జంగ్లీకి రీమేక్ )

swapna-80111214.11.1980 శుక్రవారం స్వప్న (శ్రీ లలిత ఎంటర్‌ప్రైజెస్) నిర్మాత: జి.జగదీశ్ చంద్ర ప్రసాద్; దర్శకుడు: దాసరి నారాయణరావు; సంగీతం: సత్యం; కథ: పాలగుమ్మిపద్మరాజు పాటలు: రాజశ్రీ, దాసరి నారాయణరావు; కళ: శ్రీనివాసరాజు; ఛాయాగ్రహణం: కేఎస్.మణి; కూర్పు: కృష్ణంరాజు ; తారాగణం: రాజా, స్వప్న, రాంజీ, చాట్ల శ్రీరాములు, రాంబాబు, రీనా, (ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవారే కావడం విశేషం)kalyana-jyothi-801104

14.11.1980 శుక్రవారం కల్యాణజ్యోతి(రోజారాణీమూవీస్) నిర్మాత:ఎల్.ప్రమీలారాణి; దర్శకుడు; జి.గణేష్; సంగీతం: ఎంఎస్.విశ్వనాథన్; మాటలు: శ్రీచందర్, పాటలు: ఆరుద్ర; తారాగణం: కమల్ హసన్, సుజాత, కుట్టి పద్మిని, షావుకారి జానకి;

14.11.1980 శనివారం కుక్క(అంత్యోదయాఆర్ట్ ఫిలిమ్స్) సమర్పణ:కే.భాస్కరరావు; స్క్రీన్ ప్లే,దర్శకత్వం:కడియాలశివరామయ్య; సంగీతం: నిర్మల్ కుమార్; kukkaకథ: యండమూరి వీరేంద్రనాథ్; మాటలు: మాదిరెడ్డి సులోచనారాణి; తారాగణం: నారాయణ రావు, పీఎల్.నారాయణ, తెలంగాణా శకుంతల జయపద్మ (ఈ చిత్రం నవంబర్ 14న సుదర్శన్ లో ఉదయం ఆటలు గా మాత్రమే విడుదలైంది

 

mogudu-kavali-100-daysmogudu-kaavaali-80110715.11.1980 శనివారం మొగుడుకావాలి(చరితచిత్ర కంబైన్స్) నిర్మాత: వీకే.తమ్మారెడ్డి; స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కట్టా సుబ్బారావు; అసోసియేట్ డైరెక్టర్; రవీంద్రనాథ్; సంగీతం: జేవీ.రాఘవులు; కథామూలం: రాజానవతే; నృత్యాలు: తార; మాటలు: సత్యానంద్; పాటలు:వేటూరి సుందరరామూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ; పోరాటాలు: భుమానంద్; కళ: బీ.ప్రకాశరావు; ఛాయాగ్రహణం; పీ. చెంగయ్య; కూర్పు: ఆదుర్తి హరనాథ్; తారాగణం: చిరంజీవి, గాయిత్రి, సువర్ణ, నూతన్ ప్రసాద్, ఎస్.వరలక్ష్మి, రమణమూర్తి (ఈ చిత్రం 1981 ఫిబ్రవరి 22న హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది )

ammayi-mogudu-mamaku-yamudu-100-days-810227ammayii-mogudu-mamaku-yamudu20.11.1980 గురువారం అమ్మాయికి మొగుడు మామకు యముడు (పుంపుహార్ ప్రొడక్షన్స్) నిర్మాత: మురహరి సెల్వం; దర్శకుడు : అమృతం; సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్; కథ అన్నాదురై, స్క్రీన్ ప్లే :ఎం.కరుణానిధి, మాటలు: త్రిపురనేని మహారథి; పాటలు: శ్రీశ్రీ, ఆత్రేయ, నేపథ్యగానం : బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఛాయాగ్రహణం : గజేంద్రమణి తారాగణం: కృష్ణ, రజనీ శర్మ,గుమ్మడి, సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, సారథి, రాజ్యలక్ష్మి, పుష్పలత, జయమాలిని (తమిళంలో తాము 1978లో నిర్మించిన వందికారన్ మగన్చిత్రాన్నే పుంపుహార్ సంస్థ వారు తెలుగులో ప్రునర్నిర్మించారు. వందికారన్ మగన్ చిత్రానికి కథ సమకూర్చిన అన్నాదురై, స్క్రీన్ ప్లే రాసిన ఎం.కరుణానిధి ఇద్దరు కూడా తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసి ఉండడం విశేషం)

20.11.1980 గురువారం వంశవృక్షం (వంశీకృష్ణా మూవీస్) నిర్మాతలు: హరిశ్చంద్రారెడ్డి, అరుణ రాఘవరెడ్డి; vamsavruksham-801120దర్శకుడు : బాపు; సంగీతం: కే.వి.మహాదేవన్; మాటలు ముళ్ళపూడి వెంకటరమణ; పాటలు: నారాయణ రెడ్డి; తారాగణం: జె.వి.సోమయాజులు,అనీల్ కుమార్, జ్యోతి, కాంతారావు, ముక్కామల… (ఈ చిత్రానికి కన్నడ రచయిత రాసిన ఎస్ఎల్.బైరప్ప నవల వంశవృక్షఆధారంగా 1972లో అదేపేరుతో నిర్మించిన కన్నడ చిత్రమే.)

gandara-golam-80110922.11.1980 శనివారం గందరగోళం(శ్రీలక్ష్మీనరసింహఇంటర్నేషనల్); నిర్మాత:ఎంకే.మావుళ్ళయ్య; దర్శకుడు:సింగీతం శ్రీనివాసరావు ; సంగీతం: చక్రవర్తి; కథ: సింగీతం కళ్యాణి; మాటలు: శ్రీరమణ; పాటలు: ఆరుద్ర, వేటూరి; కళ: భాస్కరరాజు; ఛాయాగ్రహణం: జీకే.రాము; కూర్పు: బాలు; తారాగణం: మోహన్, లక్ష్మీప్రసాద్, గుమ్మడి, లక్ష్మిచిత్ర, రమాప్రభ, అల్లు రామలింగయ్య, చలం, కేవీ.చలం; (ఈ చిత్రంలో ఎక్కువభాగాన్ని పాలకొల్లు, నరసాపురం మధ్య గోదావరి సోయగాలతో చిత్రీకరించడం విశేషం)sahbash-maruthi-801124

29.11.1980 శనివారం శబాష్ మారుతి (గుప్తా ఫిలింస్) నిర్మాత: కే.సులోచనమ్మ; దర్శకుడు : కే.నారాయణ; సంగీతం: శంకర్, గణేష్ & విజయ్ కుమార్; తారాగణం: దీప,

sandhya-80112829.11.1980 శనివారం సంధ్య (శ్రీ సావరిన్ ఫిలింస్) సమర్పణ: ఏఎస్ఆర్.శర్మ; నిర్మాత: కంచెర్ల పూర్ణచంద్రరావు; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉప్పలపాటి సూర్యనారాయణబాబు; దర్శకుడు: .కోదండరామిరెడ్డి; అసోసియేట్ డైరెక్టర్: సీ.రాధాకృష్ణారెడ్డి; సంగీతం: చక్రవర్తి; మాటలు:జంధ్యాల; పాటలు: ఆత్రేయ, నారాయణరెడ్డి, వేటూరిసుందరరామమూర్తి; నేపథ్యగానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ; కళ: తోట యదునాథయ్య; ఛాయాగ్రహణం: ఎస్. గోపాలరెడ్డి; కూర్పు: నాయని మహేశ్వరరావు; తారాగణం: సుజాత, శ్రీధర్, చంద్రమోహన్, గీత, గుమ్మడి, సత్యనారాయణ, అల్లురామలింగయ్య, కాంతారావు, పండరీబాయి, మిక్కిలినేని, రామం కౌశిక్, ఎస్.రాజేంద్రబాబు, కేకే.శర్మ, నిషా, భావన, బాలతారలు: బేబీ తులసి, బేబీ వరలక్ష్మి. బేబీ పింకీ; అతిథి నటులు: జగ్గయ్య, ప్రభాకర రెడ్డి, (ఇది ప్రముఖ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రాసిన తపస్యనవల ఆధారంగా 1976లో తీసిన హిందీ చిత్రం తపస్యకు తెలుగు రీమేక్

manavudu-mahaneeyudu-80112805.12.1980 శుక్రవారం మానవుడు మహనీయుడు (ఉషశ్రీ మూవీస్); నిర్మాతలు: పీజే. ప్రభాకర రెడ్డి, కైలాష్ చంద్ర అగర్వాల్; సహనిర్మాతలు: పీ.సత్యనారాయణ, సుధీర్ కుమార్ అగర్వాల్; దర్శకుడు: పీ. చంద్రశేఖర రెడ్డి; సంగీతం: చక్రవర్తి; కథ, స్క్రీన్ ప్లే: ఉషశ్రీ; నృత్యం: తార: కళ: సాయికుమార్; కూర్పు: వీ.అంకిరెడ్డి; ఛాయాగ్రహణం: జే.సత్యనారాయణ; తారాగణం: శోభన్ బాబు, సుజాత, నూతన్ ప్రసాద్;manavulu-mamathalu

05.12.1980 శుక్రవారం మానవులు మమతలు (శ్రీ విజయరాజేశ్వరీప్రొడక్షన్స్) స్క్రీన్ ప్లే, దర్శకత్వం : చంద్ర శ్రీనివాస్; నిర్మాత:కే.బాలఅంకిరెడ్డి, సంగీతం: సత్యం: మాటలు: భరత్; చాయాగ్రహణం: సాయిప్రసాద్; తారాగణం: ఈశ్వరరావు, హరనాథ్, కేవీ.చలం, సిలోన్ మనోహర్, రామచంద్రారెడ్డి, హలం, విజయలక్ష్మి

mudumulla-bandham06.12.1980 శనివారం మూడుముళ్లబంధం(గోమాతాఆర్ట్ క్రియేషన్స్) నిర్మాతలు: రంగానఅశ్వర్థనారాయణ, పొన్నతోటరఘురాం; సమర్పణ:ఆర్.అచ్చప్ప; నిర్మాణ,నిర్వహణ:వీణవెంకటేశ్వరరావు; సంగీతం సత్యం;మాటలు:అప్పలాచార్య; కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ముత్యాలసుబ్బయ్య; పాటలు: నారాయణరెడ్డి; పోరాటాలు: పరమశివం, రాజు, ; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం, శైలజ, ఆనంద్, ఆదినారాయణ; నృత్యాలు: రాజు; ఛాయాగ్రహణం: .దశరథరామ్; కూర్పు: పీ.చంద్రమోహన్; తారాగణం: శరత్ బాబు, మాధవి, రాజేంద్ర ప్రసాద్, విజయకళ, జయవాణి, సాక్షిరంగారావు; అత్తిలిలక్ష్మి, జిత్ మోహన్ మిత్ర, మోదుకూరిసత్యం, లక్ష్మీకాంతమ్మ, నూతననటులు: చంద్రకాంత్, శివరామశాస్త్రి; బాలతారలు: కుమార్, రవికుమార్; అతిథినటులు: భీమరాజు, నేరెళ్ల లక్ష్మణరావు నిర్మల ;pelligola-2

11.12.1980 గురువారం పెళ్లిగోల (రాజ్యలక్ష్మి ఫిలింస్) దర్శకుడు : కట్టా సుబ్బారావు; సంగీతం: సత్యం; పాటలు: వేటూరి సుందరరామమూర్తి; తారాగణం: మురళీ మోహన్,నూతన్ ప్రసాద్, గాయిత్రి, జయమాలిని, నాగభూషణం, మోహన్ బాబు

allari-bava12.12.1980 శుక్రవారం అల్లరిబావ (స్టార్స్ ఇంటర్నేషనల్) నిర్మాత: ఎం.బాలకృష్ణ; దర్శకుడు : పి.సాంబశివ రావు; సంగీతం: రాజన్నాగేంద్ర; పాటలు: వేటూరి; నేపథ్యగానం: సుశీల, జానకి, బాలసుబ్రహ్మణ్యం; రచన: జంధ్యాల; నృత్యం: శీను; పోరాటాలు: రాఘవులు ;కళ: ఎస్.కృష్ణారావు; కూర్పు: డీ.వెంకటరత్నం; ఛాయాగ్రహణం: వీఎస్ఆర్.స్వామి; తారాగణం: కృష్ణ, జయప్రద, కాంతారావు, ప్రభాకర రెడ్డి, నిర్మల , అల్లు రామలింగయ్య, గిరిబాబు, జయభాస్కర్, పీఎల్.నారాయణ, చిట్టిబాబు, అత్తిలిలక్ష్మి, ఝాన్సీ, సూర్యకళ, ఫణి, సుమంగళి, జయమాలిని,

talli-deevena-80121012.12.1980 శుక్రవారం తల్లిదీవెన (ఊర్మిళా పిక్చర్స్) నిర్మాత: ఎం బాబురావు; కార్యనిర్వాహక నిర్మాత: డీఎల్ . కాంతారావు; కథ,మాటలు, స్క్రీన్ ప్లే. దర్శకత్వం: గోన విజయరత్నం; సంగీతం: బీ.శంకర్; కళ: వీ.కృష్ణమూర్తి, ఉపేంద్ర, ఛాయాగ్రహణం: ఎన్ఆర్కే.మూర్తి; కూర్పు: వీ.అంకిరెడ్డి; తారాగణం: ఈశ్వర్ రావు, ప్రసాద్ బాబు, చిట్టిబాబు, లక్ష్మికళ, జయవాణి , సత్యవాణి విజయలక్ష్మి అభిలాష, మధు పీవీ రాజు, బాలతారలు :మాస్టర్ హరి, బేబీ రోహిణి, డాక్టర్ ఎం. రఘురాం ,

rakthabandham13.12.1980 శనివారం రక్తబంధం (రీకో ఫిలింస్) సమర్పణ: సీరం లక్ష్మణరావు; నిర్మాతలు: ఎస్.విజయలక్ష్మి; పీఎస్.కృష్ణ; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆలూరి రవి; సంగీతం: జీకే.వెంకటేష్; మాటలు: మోదుకూరి జాన్సన్; పాటలు:నారాయణరెడ్డి, జాలాది; నృత్యాలు: శేషు; పోరాటాలు: సెల్వమణి; కళ: రంగారావు; నేపథ్యగానం: బాలసుబహ్మణ్యం,సుశీల,జానకి,శైలజ,లతారాణి,ఆనంద్,రాజేష్; నూతనగాయకుడు వినోద్; ఛాయాగ్రహణం: పీ.భాస్కరరావు; కూర్పు: నాయనిమహేశ్వరరావు; తారాగణం: చిరంజీవి, ప్రసాద్ బాబు, నూతన్ ప్రసాద్, కవిత, రోజారమణి, సువర్ణ, సుమిత్ర, త్యాగరాజు, జయమాలిని, రమణమూర్తి, పుష్పలత, చంద్రరాజు, జయశీల, నూతనతారలు: వల్లూరి వెంకట్రామయ్య, రంజన్ బాబు, చంద్రవాసు;pasidi-moggalu-801215

18.12.1980 గురువారం పసిడి మొగ్గలు (రవి రాజ్ పిక్చర్స్) సమర్పణ: కేశవరావు & కో ; నిర్మాత: కేశన జయరాం; దర్శకుడు : దుర్గా నాగేశ్వరరావు; సంగీతం: ఇళయరాజా; పాటలు: నారాయణరెడ్డి, కొసరాజు, వేటూరి, మాటలు: జంధ్యాల; కళ: కేఎల్. ధర్ ; ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరె కూర్పు: వీటీ.రాజన్; తారాగణం: చంద్రమోహన్, మధుమాలిని, రంగనాథ్, సత్యనారాయణ, చారుహసన్, సాక్షిరంగారావు,  అల్లురామలింగయ్య, సూర్యకాంతం, బాలకృష్ణ, శ్రీనివాసరావు, నర్రా వెంకటేశ్వరరావు, అశ్విని, విజయలక్ష్మి, జయశ్రీ, అరుణ్ కాంత్, నిర్మల

aadadi-gadapa-daatite-80121619.12.1980 శుక్రవారం ఆడది గడప దాటితే (శ్రీ శ్రీనివాస పద్మావతి ప్రొడక్షన్స్) స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బీఎస్.నారాయణ; నిర్మాతలు: బీ.రామచంద్రరావు, ఏఎం.రాజా, సీ.సుబ్బారాయుడు; సంగీతం: ఎంబీ.శ్రీనివాస్; ఛాయాగ్రహణం: కేఎస్.రామకృష్ణారావు; తారాగణం: మురళిమోహన్, కన్నడ మంజుల, నరసింహరాజు, శ్రీధర్, జగ్గయ్య, శరత్ బాబు , రాజేంద్ర ప్రసాద్, జయమాలినిsivasakthi

24.12.1980 బుధవారం శివశక్తి (శ్రీ నారాయణ ఆర్ట్ మూవీస్) సమర్పణ: కట్టా అంజిబాబు, నిర్మాత: లక్ష్మి ఆండాళ్లు; దర్శకుడు: కమలాకర కామేశ్వరరావు; పర్యవేక్షణ: కోమలబాబు; సంగీతం: కేవీ.మహదేవన్; రచన: శ్రీచందర్; తారాగణం: సుజాత, జయచిత్ర, లత, వెన్నెరాడై నిర్మల, నగేష్

25.12.1980 గురువారం నాగమల్లి (వీఆర్.ఇంటర్నేషనల్) నిర్మాత: భాస్కరవర్మ; దర్శకుడు : దేవదాస్ కనకాల; సంగీతం: రాజన్నాగేంద్ర; nagamalliపాటలు: వేటూరి సుందర రామూర్తి; తారాగణం: చంద్రమోహన్, నారాయణరావు, మల్లిక, దీప, అల్లురామలింగయ్య , మల్లికార్జునరావు (చంద్రమోహన్ ప్రప్రథమంగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం జులైలోనే విడుదలవుతుందని ప్రకటించినా డి7సెంబర్ చివరలో విడుదలైంది )

mugaku-matosthe-801223mugaku-matosthe-80122627.12.1980 శనివారం మూగకు మాటొస్తే (శ్రీ శివకామేశ్వరీ పిక్చర్స్) నిర్మాత: కే.విజయకుమార్; దర్శకుడు: వీ.మధుసూదనరావు; సంగీతం: చక్రవర్తి; మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ, ఛాయాగ్రహణం: కేఎస్.ప్రసాద్;కూర్పు: డీ.వెంకటరత్నం, తారాగణం: మురళీ మోహన్, జయసుధ, శ్రీధర్, ప్రసాద్ బాబు, ఎస్.వరలక్ష్మి, కవిత, రూప, రమాప్రభ; (డిసెంబర్ 26వ తేదీన విడుదలవుంటుందని ప్రకటించిన ఈ చిత్రాన్ని ఒక రోజు వాయిదా వేసుకుని 27వ తేదీన విడుదల చేశారు )

bangaru-baava-80123131.12.1980 బుధవారం బంగారుబావ(శంభూఆర్ట్ పిక్చర్స్) నిర్మాత:యార్లగడ్డశంభూప్రసాద్; కథ: కలువకొలను సదానంద; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టాసుబ్బారావు; సంగీతం: సత్యం; నృత్యాలు: శీను; కళ:కే.రామలింగేశ్వరరావు; మాటలు: కాశీవిశ్వనాథ్; పాటలు: కొసరాజు, వేటూరి సుందరరామమూర్తి; పోరాటాలు: రాఘవులు; నేపథ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం; ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ; కూర్పు:ఎస్పీఎస్.వీరప్ప; తారాగణం: కృష్ణ, శ్రీదేవి, శ్రీధర్, చక్రపాణి, సత్యనారాయణ, నాగభూషణం, రావుగోపాలరావు, ఎస్.వరలక్ష్మి, అల్లురామలింగయ్య; ప్రభాకర్, వికారం, భీమరాజు, సీహెచ్.కృష్ణమూర్తి, శ్యామల, మమతా, అత్తిలి లక్ష్మి, జయమాలిని (ఇది కృష్ణ నటించిన 175వ చిత్రం)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


  (To Type in English, deselect the checkbox. Read more here)