మూడు అత్యున్నత పదవుల్లో …. ఒకేఒక్కడు. !!!

 సర్వోన్నత న్యాయస్దానంలో ప్రధాన న్యాయమూర్తి గా రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా రాజ్యాంగరీత్యా అన్ని సర్వోన్నత పదవులను అలంకరించి దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం పొందిన ఏకైక వ్యక్తి జుస్టిక్ హిదయతుల్లా వర్ధంతి నేడు. అయన 1968 ఫిబ్రవరి 25 నుంచి 1970 డిసెంబర్ 16 వ తేదీ వరకు సుప్రీమ్ కోర్టు 11వ ప్రధాన న్యామూర్తిగా వ్యవహరించారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజ్యాంగ రీత్యా తాత్కాలికంగా ఆరవ ఉప రాష్ట్రపతిగా పనిచేసారు. రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆకస్మికంగా మరణించడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వరాహగిరి వేంకటగిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్నారు.అయితే రాష్ట్రపతి పదవికి పోటీచేసేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి పదవుల నుంచి వి.వి.గిరి తప్పుకున్నారు అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న హిదయతుల్లా 1969 జులై 20 నుంచి ఆగష్టు 24 వ తేదీవరకు రాజ్యాంగరీత్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించాల్సి వచ్చింది.సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసాయి. 1979 ఆగుస్ట్ 31 నుంచి 1984 ఆగష్టు 30వ తేదీ వరకు అయన భారతదేశపు 6వ ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. ఇదే సమయంలో రాష్ట్రపతిగా ఉన్న జ్ఞానీ జైల్ సింగ్ శస్త్రచికిత్స కోసం సెలవుపై వెళ్లడంతో 1982 అక్టోబర్ 6 వ తేదీ నుంచి అక్టోబర్ 31 వ తేదీవరకు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నారు. ఇలా ప్రధాన న్యాయమూర్తిగా, ఉపరాష్ట్రపతిగానే గాకుండా రెండు సార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఘనత ఈ దేశచరిత్రలో ఒక్క హిదయతుల్లా కే దక్కింది. అయన 1992 సెప్టెంబర్ 18 వ తేదీన మరణించారు. న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్నిహిదయతుల్లా తీవ్రంగా నిరసించారు. జైశంకర్ మణిలాల్ షెలాత్ , అమర్ నాథ్ గ్రోవర్ కావదుర్ సదానంద్ హెగ్డే లను అధిగమించి జూనియర్ అయిన అజిత్ నాథ్ రే ను 1973 ఏప్రిల్ లో ప్రధాన న్యాయమూర్తిగా నియమించినప్పుడు హిదయతుల్లా బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు.అంతకు ముందు నుంచే పలుకేసులలో రాజ్యాంగ పరిధులను పట్టించుకోకుండా ప్రభుత్వ పక్షాన తీర్పులు చెప్పిన రే నియామకం వల్ల ఇకపై న్యాయమూర్తులు వివిధ కేసులలో ఇచ్చే తీర్పులు “న్యాయ వ్యవస్థలో ముందు చూపుకంటే ఇతరత్రా వ్యవహారాల్లో ముందు చూపును పెంచేలా తయారవుతుంద”ని హెచ్చరించడం గమనార్హం ఇప్పుడు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా కొల్లేజియం వ్యవస్థలో సభ్యులు న్యాముర్తుల నియామకం సందర్బంగా వెలిబుచ్చే అభిప్రాయాలను స్పష్టానంగా రికార్డు చేయవలసిన అవసరాన్ని గురించి వాదిస్తుండడం విశేషం.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


  (To Type in English, deselect the checkbox. Read more here)